Updated : 31/10/2021 05:42 IST

Puneeth Rajkumar: పునీత్‌కు అశ్రు నివాళి

అభిమానుల కన్నీళ్లు... చిత్రపరిశ్రమలోని ప్రముఖుల  విషాదవదనాలు... బంధుమిత్రుల శోకాలు... బెంగళూరు దుఃఖ సాగరమైంది.

గుండెపోటుతో శుక్రవారం మృతి చెందిన కన్నడ యువ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ను కడసారి చూసేందుకు తెలుగు చిత్ర ప్రముఖులు కదలివచ్చారు. వివిధ చిత్రపరిశ్రమలకు చెందిన యువ, సీనియర్‌ నటులంతా సామాజిక మాధ్యమాల్లో పునీత్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకొని... సంతాపం ప్రకటించారు. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునీత్‌ అంతిమ దర్శనానికి తెలుగు, తమిళ చిత్రపరిశ్రమలకు చెందిన నటీనటులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పునీత్‌ పార్ధివ శరీరాన్ని చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ కుమార్‌ను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. చిరంజీవి, వెంకటేష్‌, శ్రీకాంత్‌, అలీ, మంచు మనోజ్‌, నరేశ్‌, శివబాలాజీ తదితరులు పునీత్‌కు నివాళులర్పించారు. కోలీవుడ్‌ నుంచి శరత్‌కుమార్‌, ప్రభుదేవ తదితరులు పునీత్‌ను కడసారి చూసి కన్నీటిసంద్రమయ్యారు. లక్షలాది మంది అభిమానులు నివాళి అర్పించారు.

- ఈనాడు డిజిటల్‌, బెంగళూరు


 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని