కథల ఎంపికలో...

ప్రభాస్‌ కొత్త సినిమాల జాబితా చాలా పెద్దదే. విరామం లేకుండా చేసినా ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి ఏళ్ల సమయం పడుతుంది. అయినా సరే.. ఆయన కోసం కొత్త కథలు సిద్ధమవుతూనే ఉన్నాయి. అటు బాలీవుడ్‌ నుంచి ఇటు

Published : 25 Jan 2022 01:47 IST

ప్రభాస్‌ కొత్త సినిమాల జాబితా చాలా పెద్దదే. విరామం లేకుండా చేసినా ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి ఏళ్ల సమయం పడుతుంది. అయినా సరే.. ఆయన కోసం కొత్త కథలు సిద్ధమవుతూనే ఉన్నాయి. అటు బాలీవుడ్‌ నుంచి ఇటు దక్షిణాది వరకు ప్రభాస్‌ని దృష్టిలో ఉంచుకుని దర్శకులు స్క్రిప్ట్‌లు సిద్ధం చేస్తున్నారు. కరోనా పరిస్థితులతో వచ్చిన ఈ విరామంలోనూ ఆయన కొత్త కథలు వినడంపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. యువ దర్శకులు తయారు చేసిన కథలు వినడానికే ఆయన ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలిసింది.

ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారంటూ ఇటీవల పలువురు తెలుగు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రభాస్‌ మాత్రం ఇంకా కథల్ని ఎంపిక చేయడంపైనే దృష్టిపెట్టినట్టు తెలిసింది. త్వరలోనే ‘రాధేశ్యామ్‌’తో అలరించనున్న ప్రభాస్‌, ఆ తర్వాత ‘సలార్‌’ని పూర్తి చేయడం కోసం రంగంలోకి దిగుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని