Tollywood: కొత్త కబురు... సరికొత్త జోరు
విడుదలలు ఆగిపోయాయి. చిత్రీకరణలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా సినిమాలకి అడుగడుగునా అనుకోని అవాంతరాలే! అయినా సరే... కొత్త సినిమాల విషయంలో మన హీరోల ఉత్సాహం
విడుదలలు ఆగిపోయాయి. చిత్రీకరణలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా సినిమాలకి అడుగడుగునా అనుకోని అవాంతరాలే! అయినా సరే... కొత్త సినిమాల విషయంలో మన హీరోల ఉత్సాహం కొనసాగుతోంది. మూడో దశ కరోనాతో చిత్రసీమలో మరోసారి ఒడుదొడుకులు కొనసాగుతున్న నేటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోలు కొత్త సినిమాల్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. పలు కొత్త కలయికలు ప్రచారంలో ఉన్నాయి. ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి.
కరోనా పరిస్థితుల్ని ఎదుర్కోవడం తెలుగు చిత్రసీమకి అలవాటైపోయింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణల్ని కొనసాగించడం...కరోనా తగ్గుముఖం పడుతోందనే సంకేతాలు కనిపించగానే కొత్త సినిమాల్ని విడుదల చేయడం... అలా మిగతా పరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్రసీమ కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మన సినిమాలకి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న కీలక సమయం కూడా ఇదే. దేశం మొత్తం తెలుగు కథలు, కథానాయకులవైపే చూస్తోంది. దాంతో మన హీరోలంతా అనుకూలమైన ఈ పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మార్కెట్‌కి, డిమాండ్‌కి అనుగుణంగానే కొత్త సినిమాలకి వెంట వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ఒకొక్క హీరో దగ్గర చేయాల్సిన సినిమాల జాబితా చాంతాడంత ఉన్నప్పటికీ మరో కథ వినేందుకు సిద్ధపడుతున్నారు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ తదితరుల కోసం కొత్తగా కథలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయా కథానాయకులకి సంబంధించిన పలు సినిమాలు ప్రచారంలో ఉన్నాయి.
* ‘అఖండ’తో విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, తదుపరి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు బాలకృష్ణ. ఈ రెండు సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ కూడా బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతోందని, అందుకోసం దర్శకుల నుంచి కథలు కూడా ఆహ్వానిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పలువురు యువ దర్శకులు బాలకృష్ణ కోసం కథలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
* ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఆయన నటించిన ‘రాధేశ్యామ్’ కూడా విడుదల కావల్సి ఉంది. ‘సలార్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు చేస్తున్న ఆయన, నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్ కె’, సందీప్ వంగాతో కలిసి ‘స్పిరిట్’ సినిమాల్ని కూడా పూర్తి చేయాల్సి ఉంది. మరో బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ శంకర్‌తోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. ఇన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నప్పటికీ ఇటీవల మరో టాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారని వినిపించింది. ప్రభాస్‌తో సినిమాలు చేయడం కోసం టాలీవుడ్‌కి చెందిన పలు అగ్ర నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రచించాయి. ఆ సంస్థల్లో చేయాల్సిన సినిమాల కోసమే ప్రభాస్ ప్రస్తుతం కొత్త కథలు వింటున్నారని తెలిసింది. వీటితోపాటు బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్ ఓ తెలుగు దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్ట్ సెట్ చేశారని సమాచారం.
* ‘పుష్ప’తో తిరుగులేని విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ చేతిలోనూ రెండు సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప2’ కోసం త్వరలోనే రంగంలోకి దిగనున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థలో రూపొందనున్న ఆ సినిమా కోసం ఇప్పటికే పనులు మొదలైనట్టు తెలుస్తోంది. ఆ రెండు సినిమాలతోపాటు తాజాగా తమిళ దర్శకుడు అట్లీ కూడా అల్లు అర్జున్‌కి కథ చెప్పారని ప్రచారం సాగుతోంది. ‘పుష్ప’తో అల్లు అర్జున్ విజయవంతంగా పాన్ ఇండియా మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు. ఇకపై ఆయన ఆ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకునే కథలు ఎంచుకోనున్నారని, అందులో భాగంగానే అట్లీతో సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ‘లైగర్’ చేస్తున్న విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలో మరో సినిమా కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే ఈ ఇద్దరూ మరో సినిమాని మొదలు పెడుతున్నారని, అందుకోసం అంతా సెట్ అయ్యిందని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కొత్త సినిమాల విడుదల మాటేమో కానీ... కొత్త కలయికలకి సంబంధించిన కబుర్లు మాత్రం ప్రేక్షకుల్లో కావల్సినంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు..
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్