Pawankalyan: అధ్యాపకుడిగా తొలిసారి

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ను పూర్తి చేయాల్సి ఉంది. ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి హిట్‌ తర్వాత పవన్‌ - హరీష్‌ కలయికలో రూపొందుతోన్న రెండో చిత్రమిది.

Updated : 23 May 2022 08:16 IST

వన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ను పూర్తి చేయాల్సి ఉంది. ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి హిట్‌ తర్వాత పవన్‌ - హరీష్‌ కలయికలో రూపొందుతోన్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ఆగస్ట్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఓ జాతీయ మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇది సూపర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. పూర్తిగా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పవన్‌ కల్యాణ్‌ తొలిసారి లెక్చరర్‌ పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన చాలా అందమైన లుక్‌లో కనిపిస్తారు. ఆగస్ట్‌ నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. 80శాతం షూటింగ్‌ ఇక్కడే కొనసాగుతుంది. దీన్ని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లే ఆలోచన లేదు’’ అని హరీష్‌ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు