Pushpa2: ‘పుష్ప2’ పాటల పనులు షురూ

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఈ చిత్రం సంచలన విజయాన్ని అందకోవడంతో ‘పుష్ప2’పై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Published : 10 Aug 2022 04:36 IST

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఈ చిత్రం సంచలన విజయాన్ని అందకోవడంతో ‘పుష్ప2’పై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సంగీత పనులకు శ్రీకారం చుట్టింది. ‘పుష్ప’ పాటలు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ‘పుష్ప: ది రూల్‌’ పాటలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వీటికి తగ్గట్లుగానే పార్ట్‌-2 పాటల కోసం సుకుమార్‌ ఆధ్వర్యంలో దేవిశ్రీ ప్రసాద్‌ - చంద్రబోస్‌ బృందం గట్టి కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రెండు పాటలకు సంబంధించిన ట్యూన్స్‌ సిద్ధమయ్యాయని, సాహిత్య విషయమై చంద్రబోస్‌, సుకుమార్‌, దేవిశ్రీకి మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా ముగ్గురు విదేశాల్లో దిగిన ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని