రామ్‌ ‘రెడ్’ టీజర్‌ వచ్చేసింది..!

‘వాంటెడ్‌గా ఇందులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్‌లో వాడుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ అబ్‌సెషన్‌.. నేనే’ అని అంటున్నారు ఎనర్జీటిక్ స్టార్‌ రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌..

Published : 28 Feb 2020 17:29 IST

హైదరాబాద్‌: ‘వాంటెడ్‌గా ఇందులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే లైఫ్‌లో వాడుకున్న వన్‌ అండ్‌ ఓన్లీ అబ్‌సెషన్‌.. నేనే’ అని అంటున్నారు ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌.. సిద్ధార్థ్‌, ఆదిత్య అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో రామ్‌కు జంటగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ సందడి చేయనున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘క్రైం హిస్టరీలో ఇలాంటి కేసును చూడడం ఇదే ఫస్ట్‌ టైం’ అనే డైలాగ్‌తో ఆరంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. క్లాస్‌, మాస్‌ లుక్స్‌లో రామ్‌ మెప్పించారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం తర్వాత రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత కిషోర్‌ తిరుమల - రామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘తడమ్‌’కి రీమేక్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని