అదే నా అధికారిక పేజీ: నివేదా పేతురాజు

తమ అభిమాన నటీనటుల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోడానికి చాలామంది అభిమానులు సోషల్‌మీడియా బాట పడతారు. అయితే కొన్నిసార్లు సోషల్‌మీడియాలో నటీనటులకు సంబంధించి....

Published : 04 May 2020 16:09 IST

మిగిలిన వాటిని నమ్మకండి

హైదరాబాద్‌: తమ అభిమాన నటీనటుల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోడానికి చాలామంది అభిమానులు సోషల్‌మీడియా బాట పడతారు. అయితే కొన్నిసార్లు సోషల్‌మీడియాలో నటీనటులకు సంబంధించి నకిలీ అకౌంట్లు ఉండడంతో చాలామంది బోల్తాపడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నివేదా పేతురాజు తన ట్విటర్‌ ఖాతా గురించి అభిమానులకు తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్‌ చేశారు. @Nivetha_Tweets అనేది మాత్రమే తన అధికారిక ట్విటర్‌ ఖాతా అని వెల్లడించారు. తన పేరుతో ఉన్న మిగిలిన ఖాతాలను నమ్మవద్దని సూచించారు.

‘హాయ్‌ ఆల్‌, ట్విటర్‌లో ఎన్నో నకిలీ ఖాతాలు ఉంటున్నాయి. నాకు ట్విటర్‌ ఖాతా ఉంది. @Nivetha_Tweets అనేది మాత్రమే నా అధికారిక ట్విటర్‌ పేజీ. నకిలీ ఖాతాలను ప్రోత్సహించకండి. నా ట్విటర్‌ పేజీకి కూడా త్వరలోనే అధికారిక గుర్తింపు పొందడం కోసం చూస్తున్నాను. థ్యాంక్యూ’ అని నివేదా పేతురాజు తెలిపారు.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలో నివేదా సందడి చేశారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నివేదా నందిని అనే పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘రెడ్‌’ సినిమాలో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నివేదా.. ఇన్‌స్పెక్టర్‌ యామినిగా మెప్పించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు