Imtiaz ali: నిజమే! అంత కరెక్ట్‌గా ఎలా చెప్పారు?

‘అగర్‌ తుమ్‌ సాత్‌ హో...!’ బాలీవుడ్‌ లవ్‌ సాంగ్స్‌లో ఇప్పటికీ టాప్‌ లిస్ట్‌లో ఉంటుంది. విడుదలై ఆరేళ్లైనా అందులో ఉండే కొత్తదనం, మెలోడీ ట్యూన్‌, అర్జిత్‌ సింగ్‌ గానం ఈపాటను పదేపదే వినేలా చేస్తుంది. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణె  హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌ డ్రామా ‘తమాషా’లోనిదీ పాట.

Published : 27 Nov 2021 01:13 IST

అందుకే రణ్‌బీర్‌-దీపికాను ఆ రంగు దుస్తుల్లో చూపించాం: ఇంతియాజ్‌ అలీ

ముంబయి: ‘అగర్‌ తుమ్‌ సాథ్‌ హో...!’ బాలీవుడ్‌ లవ్‌ సాంగ్స్‌లో ఇప్పటికీ టాప్‌ లిస్ట్‌లో ఉంటుంది. విడుదలై ఆరేళ్లైనా అందులో ఉండే కొత్తదనం, మెలోడీ ట్యూన్‌, అర్జిత్‌ సింగ్‌ గానం ఈ పాటను పదేపదే వినేలా చేస్తుంది. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, దీపికా పదుకొణె  హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌ డ్రామా ‘తమాషా’లోనిదీ పాట. 2015లో విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ మంచి హిట్‌ సాధించింది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలందించిన ఈ చిత్రంలో ‘అగర్‌ తుమ్‌ సాథ్‌ హో’లో దాగిఉన్న ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ పాటలో రణ్‌బీర్‌-దీపిక ధరించిన దుస్తులు వారి హార్ట్‌, బ్రెయిన్‌ను ప్రతిబింబిచేలా ఉందంటూ తాజాగా ఓ నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ ఈపాటలో తారా(దీపిక) వెడ్‌ (రణ్‌బీర్‌) ఎరుపు రంగు, లేత రంగు దుస్తులు ధరించారు. దీని వెనుక ఓ ప్రధానకారణం ఉంది. ఇది వారి భావోద్వేగాలను తెలియజేస్తుంది. ఎరుపు రంగు ‘హార్ట్‌’ గురించి చెబితే.. లైట్‌ రంగు ‘బ్రెయిన్‌’ గురించి తెలియజేస్తుందంటూ అంటూ ఆ పాటలోని అంతరార్థాన్ని వివరించాడు. ఇదే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ఇంతియాజ్‌ అలీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అంగీకరించారు. ‘‘అవును! అతడు చెప్పింది అక్షరాలా నిజం. అంత కరెక్ట్‌గా ఎలా చెప్పారు. ఆ పాత్రలకు ఆ రంగు దుస్తులను మేం అందుకే ఎంపిక చేసుకున్నాం’’ అని బదులిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని