vijay devarakonda: మహేష్‌బాబు ట్వీట్ మర్చిపోలేను!
సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే నటుల్లో విజయ్ దేవరకొండ ముందుంటాడు.
సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుగ్గా ఉండే నటుల్లో విజయ్ దేవరకొండ ముందుంటాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ లైగర్ హీరో... ఇష్టాయిష్టాలనూ చెప్పేస్తున్నాడిలా...
తనే నా సూపర్ హీరో
నేను ఇష్టపడే మొదటి వ్యక్తి... ఇంకెవరూ మా అమ్మే. నా దృష్టిలో మా అమ్మ ఓ సూపర్ హీరో. నా ప్రతి దశలో, ప్రతి విజయంలో అమ్మ ఉంది. ఒకప్పుడు నేను ఏది అడిగినా కాదూ లేదూ అనకుండా చేసిన మా అమ్మకు ఇప్పుడు నేను గిఫ్ట్‌లూ, సర్‌ప్రైజ్‌లూ ఇస్తున్నందుకు గర్వంగా, ఆనందంగా అనిపిస్తుంటుంది.
క్రీడలంటే ఇష్టం
ఒక నటుడిగా ఫిట్‌గా కనిపించేందుకు రోజూ జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేస్తున్నా కూడా నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్... వంటివి ఆడుతూ కూడా ఫిట్‌గా ఉండొచ్చనేది నా అభిప్రాయం.
ప్రకృతికి దగ్గరగా
నాకు ఫలానా ప్రాంతమే నచ్చుతుందని లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతికి దగ్గరగా గడిపే అవకాశం వస్తే చాలు ఎన్నిగంటలైనా అక్కడే ఉండిపోతా... అది ముంబయి, ప్యారిస్... ఏదయినా నాకు ఓకే.
ఇష్టమైన నటి
ఒకప్పుడు దీపికా పదుకొణె నటనను ఇష్టపడేవాడిని. ఆలియాభట్ చేసిన ‘గల్లీబాయ్’, ‘రాజీ’ వంటి సినిమాలు చూశాక అబ్బా... ఎంత బాగా చేస్తోందో అనిపించింది. ఇప్పుడు తన నటనకు వీరాభిమానిని అయిపోయా.
నచ్చే ఆహారం
దమ్ బిర్యానీ, బర్గర్లు. ఈ రెండూ ఎదురుగా ఉన్నాయంటే డైటింగ్, ఫిట్నెస్ వంటి విషయాలను పక్కన పెట్టేస్తా. అయితే చాలా పరిమితంగానే తింటాననుకోండీ. అవి లేకపోతే మాత్రం పోషకాహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా.
ఇష్టమైన సినిమా
టైటానిక్, పోకిరి. ఇప్పటివరకూ ఈ రెండు సినిమాలను ఎన్నిసార్లు చూసి ఉంటానో చెప్పలేను.
అభిమానించే నటుడు
మహేష్‌బాబు. నేను థియేటర్లో చూసిన మహేష్‌బాబు మొదటి సినిమా ‘మురారి’. ఇప్పుడంటే మల్టీప్లెక్స్‌లూ, ప్రీబుకింగ్లూ వచ్చాయి కానీ... ఒకప్పుడు మహేష్ సినిమా విడుదల అవుతోందంటే... గంటముందు థియేటర్‌కు వెళ్లినా టికెట్ దొరుకుతుందో
లేదో తెలియని పరిస్థితి. నేను కూడా సినిమా రంగంలోనే ఉన్నా మహేష్‌బాబుకి మాత్రం పెద్ద అభిమానిని. ‘పెళ్లిచూపులు’ సినిమా విడుదలయ్యాక నా నటనను మెచ్చుకుంటూ మహేష్ ట్విటర్లో ఓ మెసేజ్ పెట్టాడు. దాన్ని చూసిన రోజు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగిందంటే నమ్మండి... మహేష్ తరువాత నాకు రణ్‌బీర్‌కపూర్ నటన నచ్చుతుంది.
ఖరీదైన కార్లు అదో క్రేజు
నాకు ముందునుంచీ కార్లంటే చెప్పలేనంత ఇష్టం. అందుకే వాటిని కొనే అవకాశం వచ్చినప్పుడల్లా ఏ మాత్రం ఆలోచించకుండా తీసేసుకుంటా. అందులో ఫోర్డ్ మస్టంగ్ ఒకటి. దాదాపు డెబ్బై అయిదు లక్షలు విలువచేసే ఆ కార్లో కూర్చుని వెళ్తుంటే ఆ కిక్కేవేరని ఒకప్పుడు అనుకునేవాడిని. ఆ కారు కొని... అందులో కూర్చుని రోడ్లమీద దూసుకుపోతున్నప్పుడు మొత్తానికి నేను అను కున్నది సాధించగలిగాననే ఆనందం నాలో కలిగింది. ఇది కాకుండా మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, వోల్వో ఎక్స్‌సి 90, రేంజ్‌రోవర్... వంటివీ నా గ్యారేజ్‌లో ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్‌ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్‌నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...