Jug Jugg Jeeyo: వరుణ్‌-కియారా ‘జగ్‌ జగ్‌ జీయో’.. నవ్వులు కురిపిస్తున్న ట్రైలర్‌!

వరుణ్‌ధావన్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం ‘జగ్‌ జగ్‌ జీయో’. ప్రముఖ నటులు అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు.

Published : 22 May 2022 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుణ్‌ధావన్‌, కియారా అడ్వాణీ జంటగా నటించిన చిత్రం ‘జగ్‌ జగ్‌ జీయో’. ప్రముఖ నటులు అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ మెహతా దర్శకుడు. ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. హాస్య సన్నివేశాలతోపాటు వేడుక నేపథ్యంలో వచ్చే ఓ సాంగ్‌తో రూపొందిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరించింది. ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీతో రూపొందినట్టు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతోంది. ఈ వీడియోలో కనిపించిన ప్రతి పాత్రా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంది. నాయకానాయికల పెళ్లి, విడాకుల ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని