Dhanush Aishwarya: ధనుష్‌-ఐశ్వర్య విడిపోవడానికి అదే కారణం!

కోలీవుడ్‌ స్టార్‌ నటుడు ధనుష్‌ విడాకుల విషయంపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా స్పందించారు. ధనుష్‌-ఐశ్వర్యలను తిరిగి కలిపేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు

Published : 20 Jan 2022 17:47 IST

విడాకులపై స్పందించిన నటుడి తండ్రి కస్తూరి రాజా

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ నటుడు ధనుష్‌ విడాకుల విషయంపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా స్పందించారు. ధనుష్‌-ఐశ్వర్యలను తిరిగి కలిపేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ కోలీవుడ్‌ పత్రికతో మాట్లాడారు. ‘‘భార్యాభర్తల మధ్య కలహాలు రావడం సర్వసాధారణం. అదే మాదిరిగా ధనుష్‌-ఐశ్వర్యల మధ్య కూడా చిన్న చిన్న కుటుంబ కలహాలు తలెత్తాయి. విడాకుల ప్రకటన వాళ్ల వ్యక్తిగత విషయం. వాళ్లకి నచ్చజెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం వాళ్లిద్దరూ చెన్నైలో లేరు. ‘సార్‌’ షూట్‌ కోసం ధనుష్‌ - ఐశ్వర్య హైదరాబాద్‌కు వెళ్లారు. విడాకుల ప్రకటనపై ఇప్పటికే వాళ్లిద్దరితో ఫోన్‌లో మాట్లాడాను. మరోసారి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తా’’ అని కస్తూరి రాజా వివరించారు.

కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌, హాలీవుడ్‌ల్లోనూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు ధనుష్‌. ఈ క్రమంలోనే ఆయన వృత్తిపరమైన జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వ్యక్తిగత జీవితానికి కాస్త తక్కువగా సమయం కేటాయించాల్సి వచ్చిందట. ఈ విషయంపై ఇప్పటికే ధనుష్‌-ఐశ్వర్యల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయని, దీంతో విడిపోవాలని గత కొన్ని నెలల క్రితమే నిర్ణయించుకున్నారని.. పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని