MaheshBabu: ఆ సినిమా చూస్తే నాకు కన్నీళ్లు వస్తాయ్‌: మహేశ్‌

‘సర్కారువారి పాట’తో సూపర్‌సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. సుమారు రెండేళ్ల తర్వాత తన విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండటంతో మహేశ్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.....

Published : 20 May 2022 15:10 IST

హైదరాబాద్‌: ‘సర్కారువారి పాట’తో సూపర్‌సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu). సుమారు రెండేళ్ల తర్వాత తన విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండటంతో మహేశ్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఓ మ్యాగజైన్‌ కోసం స్పెషల్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. తన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను మ్యాగజైన్‌తో పంచుకున్నారు. అనంతరం రాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌ మహేశ్‌ ఎన్నో సరదా సంగతులు తెలియజేశారు. ఆ విశేషాలు..

మిమ్మల్ని ఎక్కువగా ఏ నిక్‌ నేమ్‌తో పిలుస్తారు?

మహేశ్‌: నాని

మీరు ఎక్కువగా భయపడే విషయం?

మహేశ్‌: నా దర్శకుల అంచనాలు అందుకోలేనేమోనని ఎక్కువగా భయపడుతుంటా!

మీ గురించి కేవలం మీ కుటుంబానికి మాత్రమే తెలిసిన ఒక విషయం?

మహేశ్‌: నేను ఎంతో సరదాగా ఉండే వ్యక్తిని. నా భార్యాపిల్లలకు మాత్రమే ఇది తెలుసు.

మీరు ఇప్పటివరకూ చేసిన అడ్వెంచర్‌?

మహేశ్‌: న్యూజిలాండ్‌లో బంగీ జంప్‌ చేశా.

మీ ఊత పదం?

మహేశ్‌: బ్యూటీఫుల్‌

ఏ సినిమా చూసి మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు?

మహేశ్‌: లయన్‌ కింగ్‌. ఆ సినిమా చూసినప్పుడల్లా నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి.

ఇక దర్శకుడిగా మీ సినిమాలను మీరే రీక్రియేట్‌ చేయాలనుకుంటే దేన్ని చేస్తారు? 

మహేశ్‌: ఒక్కడు

మీ ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమా?

మహేశ్‌: అల్లూరి సీతారామరాజు

ఇప్పటివరకూ మీరు రుచి చూసిన ఫుడ్స్‌లో ఏది కాస్త వింతగా అనిపించింది?

మహేశ్‌: థాయ్‌లాండ్‌లో ఓసారి విభిన్నమైన సీ-ఫుడ్‌ తిన్నాను. దాని పేరు గుర్తులేదు. కానీ చాలా వింతగా అనిపించింది. నాకస్సలు నచ్చలేదు.

ఫ్యామిలీ డిన్నర్‌ కోసం ఎక్కువగా వెళ్లే రెస్టారెంట్‌?

మహేశ్‌: హైదరాబాద్‌లో దక్షిణ్‌.. అక్కడ దక్షిణాది భోజనం చాలా బాగుంటుంది.

మీరు ఎలా రిలాక్స్‌ అవుతుంటారు?

మహేశ్‌: ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌కు వెళ్తుంటాను.

వెకేషన్స్‌కు వెళ్లినప్పుడు మీరు ఎక్కువగా చేసే పని?

మహేశ్‌: ఇష్టమైన ఫుడ్‌ తినడం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని