F 3: ఈసారి ‘ఎఫ్ 2’కి మించిన నవ్వులు.. పాటలు: దేవిశ్రీ ప్రసాద్
ఆయన అందించిన బీట్ వింటే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఆయన పాటలకు శ్రోతలు ఫిదా అవ్వాల్సిందే. ఆ సంగీతం సంచలనం మరెవరో కాదు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మ్యూజిక్ అందించిన తాజా చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ విలేకరులతో మాట్లాడారు. ఆ సంగతులివీ..
ఇంటర్నెట్ డెస్క్: ఆయన అందించిన బీట్ వింటే చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఆయన పాటలకు శ్రోతలు ఫిదా అవ్వాల్సిందే. ఆ సంగీతం సంచలనం మరెవరో కాదు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మ్యూజిక్ అందించిన తాజా చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ విలేకరులతో మాట్లాడారు. ఆ సంగతులివీ..
* ‘ఎఫ్ 3’ ఎలా ఉండబోతుంది?
దేవిశ్రీ: ‘ఎఫ్ 2’కి మించి ఉండబోతుంది. దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు నవ్వీనవ్వీ నా పొట్ట చెక్కలైంది. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాలు ఎలా ఉంటాయో ఇదీ ఆ తరహాలోనే గిలిగింతలు పెట్టబోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, సునీల్, అలీ.. ఇలా అందరూ తమదైన శైలిలో నవ్వులు పంచారు ఈ చిత్రంలో.
* ‘ఎఫ్ 2’కు మీరిచ్చిన సంగీతం శ్రోతలను విశేషంగా మెప్పించింది. ‘ఎఫ్ 3’ విషయంలో ఒత్తిడి అనిపించిందా?
దేవిశ్రీ: అనిల్ రావిపూడి పక్కనుంటే అసలు ఒత్తిడే అనిపించదు. స్క్రిప్ట్‌తోనే ఆయన సినిమా చూపిస్తారు. ఆయా పాత్రల గురించి వివరిస్తూ.. ఆయనే వాటిల్లో ఒదిగిపోతారు. అనిల్‌లో మంచి నటుడున్నాడు. సంగీతం విషయానికొస్తే.. ‘ఎఫ్ 2’లో పాటలు సందర్భానుసారం వచ్చేవే. ‘ఎఫ్ 3’లో మరో ముందడుగేశాం. సామాజికాంశాలు శ్రోతలకు కనెక్ట్ అయ్యేలా ప్రయత్నించాం.
* ఇప్పటికే ‘ఎఫ్ 3’ ఆల్బమ్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విషయంలో మీరు మరిచిపోలేని ప్రశంస?
దేవిశ్రీ: పాటలు బాగున్నాయంటూ చాలా మంది సందేశాలు పంపారు. పాటలతోపాటు నేపథ్యసంగీతం బాగుందని అనిల్ రావిపూడి మెచ్చుకోవడాన్ని మరిచిపోలేను. ‘మీకు వంద హగ్గులు, వంద ముద్దులు’ అంటూ ఆయన నన్ను పొగడ్తల్లో ముంచెత్తారు.
* కంపోజ్ విషయంలో మెలొడీ, ఐటెమ్ గీతాలకుండే తేడా వివరిస్తారా?
దేవిశ్రీ: మెలొడీ, ప్రత్యేక గీతాలకు సంబంధించి ఓ తేడా ఉంది. సన్నివేశం, కథ ఆధారంగా మెలొడీలు వస్తుంటాయి. ఐటెమ్ పాటలకు ఇలాంటివేం అవసరం లేదు. పాటను స్వరపరిచేటపుడు నేను ఓ కంపోజర్‌గా కాకుండా శ్రోతలానే ఉంటా. ట్యూన్ కంపోజ్ చేశాక దానికి నేను డ్యాన్స్ చేస్తానా, లేదా? అని చెక్ చేసుకుంటా. అలా నేను కట్టిన ట్యూన్‌కు నా కాలు కదిలిందంటే ఆ పాట హిట్టే అనుకుంటుంటా.
* సంగీత దర్శకుల మధ్య ఎలాంటి పోటీ ఉంటుంది?
దేవిశ్రీ: సంగీత దర్శకుల మధ్య పోటీ అనేదే ఉండదు. ఒకరి పాట ఒకరికి నచ్చితే దాని నుంచి ప్రేరణ పొందుతుంటాం. ఇలాంటివి మనమూ చేస్తే బావుంటుందనిపిస్తుంటుంది.
* ఒక్కోసారి పాటలు హిట్ అయినా సినిమాలు విజయం అందుకోవు. అప్పుడేమనిపిస్తుంది?
దేవిశ్రీ: ఇలాంటి జరగడం సహజమే. ఆల్బమ్స్ సూపర్‌హిట్ అవుతాయి కానీ సినిమాలు అంతగా ఆడకపోవచ్చు. ఈ విషయంలో పెద్దగా ఫీలవను. ఆ ప్రయాణాన్ని నెమరువేసుకుంటుంటా. ఒక్కోసారి మనం ఊహించినదానికంటే పెద్ద విజయం అందుకుంటాయి. ‘రంగస్థలం’ ఈ కోవలోకే వస్తుంది. ఈ చిత్రం తెలుగులో విడుదలైనా నాకు దేశవ్యాప్తంగా గుర్తింపొచ్చింది. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో ఇంకా ఎక్కువమందిని అలరించగలిగా.
* నిర్మాత దిల్‌రాజుతో మీ ప్రయాణం గురించి?
దేవిశ్రీ: మేము నిర్మాత- సంగీత దర్శకుడిగా కాకుండా కుటుంబ సభ్యుల్లా ఉంటాం. ఆయనకు సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. ఆయన చూడని విజయాలు లేవు. అయినా ఇంకా ఏదో చేయాలని తపన పడుతుంటారు. ఆయన నిర్మించే సినిమాల గురించి నాతో చర్చిస్తుంటారు. నా జడ్జిమెంట్‌పై ఆయనకు ఎంతో నమ్మకం. మేం ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్‌తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్. -
Janhvi Kapoor: నాన్న ఆ విషయం నాకూ చెప్పలేదు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘దేవర’ సినిమా విశేషాలతో పాటు మరికొన్ని సంగతులు పంచుకున్నారు. -
Varun Tej: ఆ సీక్వెల్లో నేనెందుకు నటిస్తా?.. చరణ్ చేస్తాడు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన పాల్గొని సందడి చేశారు. -
Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు.. -
Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్
హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు. -
Ravi Teja: ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ
రవితేజ, వరుణ్ తేజ్.. తమ కొత్త చిత్రాల విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. అవేంటో చూసేయండి.. -
Venu: అలా అనుకొనే వారికి సమాధానమే ‘బలగం’..: వేణు యెల్దండి
హాస్యనటుడు, దర్శకుడు వేణు యెల్దండి ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ జీవితం, అనుభవాలను పంచుకున్నారు.