Naga Chaitanya: 45 రోజుల తర్వాత నాగచైతన్య తొలి పోస్ట్

టాలీవుడ్‌ నటుడు నాగచైతన్య (Naga chaitanya) భార్య సమంత (Samantha) తో విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా కనిపించలేదు. 45 రోజుల విరామం తరువాత.. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిపోస్ట్‌ చేశారు.  

Published : 21 Nov 2021 01:17 IST

‘గ్రీన్‌ లైట్స్‌’ అనే ఆత్మకథ.. నా జీవితంలో ముందుకు వెళ్లేందుకు బాగా ఉపయోగపడింది

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు నాగచైతన్య (Naga chaitanya) భార్య సమంత (Samantha) తో విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా కనిపించలేదు. 45 రోజుల విరామం తరువాత.. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిపోస్ట్‌ చేశారు.  అమెరికన్ హాలీవుడ్‌ నటుడు మాథ్యూ మెకన్‌హే రచించిన  ‘గ్రీన్‌ లైట్స్‌’ (Green Lights) అనే ఆటోబయోగ్రాఫ్రి చదివిన చైతూ.. ‘‘జీవితానికి ప్రేమ లేఖ.. గ్రీన్‌లైట్స్‌’’  అని అభివర్ణించారు. రచయిత మాథ్యూని ట్యాగ్‌ చేస్తూ.. మీ ఆత్మకథని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు నాకు ఈ పుస్తకం ఉపయోగపడింది. ఇలాంటి పుస్తకం రచించినందుకు మీకు గౌరవవందనాలు సర్‌!’’ అంటూ  కొనియాడారు. వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగా ఉంచేందుకు ఇష్టపడే చైతూ.. సోషల్‌మీడియాలో పోస్టింగ్స్‌ చేయడం ఇష్టం ఉండదని గతంలో సమంత నిర్వహించిన సామ్‌- జామ్‌ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్‌ కార్లు, బైక్‌ రైడింగ్‌ని అమితంగా ఇష్టపడే చై.. తొలిసారి జీవితానికి సంబంధించిన పుస్తకం గురించి చర్చించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బంగ్రార్రాజు, థాంక్యూ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ యువ హీరో త్వరలోనే ఓటీటీల్లోనూ అడుగుపెట్టనున్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ హారర్‌ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని