Bollywood: కార్గిల్‌లో.. చైతూ- ఆమీర్‌ఖాన్
యువ నటుడు నాగ చైతన్య త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో చైతూ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా సెట్లో అడుగుపెట్టారాయన.
ఇంటర్నెట్ డెస్క్: యువ నటుడు నాగ చైతన్య త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆమీర్ ఖాన్ కీలకపాత్రలో తెరకెక్కుతోన్న ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా సెట్లో అడుగుపెట్టారాయన. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్లో దిగిన ఫొటోని పంచుకున్నారు. ఇందులో ఆర్మీ దుస్తుల్లో కనిపించారు చైతూ, ఆమీర్. ప్రస్తుతం ఈ సినిమా తుది షెడ్యూల్‌ని కార్గిల్‌లో చిత్రీకరిస్తున్నారు. 20రోజుల పాటు ఈ షూటింగ్ కొనసాగుతుందని చిత్రవర్గాలు తెలిపాయి. ఆమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్న ఈ కామెడీ-డ్రామా చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. 1994లో హాలీవుడ్లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి చిత్రానికి ఇది రీమేక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ