Published : 21/11/2021 01:09 IST

Bigg Boss Telugu 5: సన్నీపై పగ తీర్చుకున్నావా? రవికి మరో కొత్త పేరు పెట్టిన నాగార్జున

హైదరాబాద్‌: గత వారం రోజులుగా బిగ్‌బాస్‌(Bigg boss) హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున(Nagarjuna) మాట్లాడారు. బాగా ఆడిన వారికి గోల్డ్‌, వరెస్ట్‌ పెర్ఫార్మర్‌కు కోల్‌(బొగ్గు)ఇవ్వాలని నాగార్జున సూచించారు. దీంతో సన్నీకి రవి వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఇచ్చాడు. స్విమ్మింగ్‌ టాస్క్‌లో సన్నీపై పగ తీర్చుకున్నావా? అని నాగార్జున రవిని ప్రశ్నించారు. ‘అదేం లేదు’ అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఇక శ్రీరామ్‌కు వచ్చిన పవర్‌ రవి తీసుకోవడంతో బకరా అయ్యాడని నాగార్జున ఆటపట్టించారు. మరోవైపు తరచూ గొడవ పడుతున్న షణ్ముఖ్‌(Shanmukh), సిరి(siri)లపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురిని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి క్లాస్‌ తీసుకున్నారు. తనని తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు.

‘ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా’ అని ప్రశ్నించారు. ‘ఏమో సర్‌.. నాకు క్లారిటీ లేదు. నా స్టోరీ నాకు తెలుసు. బయట నేనేంటో తెలుసు. అయినా బంధం ఏర్పడుతోంది ఎందుకో తెలియడం లేదు’ అంటూ సిరి కన్నీటి పర్యంతమైంది. ఇదే విషయమై షణ్ముఖ్‌ను ప్రశ్నించగా, ‘మెంటల్‌గా వీక్‌ అయిపోయాను సర్‌. దీప్తిని చాలా మిస్‌ అవుతున్నా సర్‌’ అని అనగానే ‘బిగ్‌బాస్‌ ఓపెన్‌ ది గేట్స్‌. దీప్తిని మిస్‌ అయితే, బయటకు వెళ్లిపో’ అని నాగార్జున అనడంతో షణ్ముఖ్‌ ఆశ్చర్యపోయాడు. మరి షణ్ముఖ్ నిజంగా వెళ్లిపోయాడా? ఇద్దరికి నాగార్జున ఇచ్చిన సలహాలు ఏంటి? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!



Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని