Bhala Thandhanana Teaser: నిజాయితీగా ఉంటే సాధారణ మనిషికి కూడా రిస్కే

‘‘నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్‌మెన్‌కి కూడా రిస్కే’’ అని అంటున్నారు నటి కేథరిన్‌. ఆమె, నటుడు శ్రీవిష్ణు జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’....

Published : 28 Jan 2022 11:52 IST

హైదరాబాద్‌: ‘‘నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్‌మెన్‌కి కూడా రిస్కే’’ అని అంటున్నారు నటి కేథరిన్‌. ఆమె, నటుడు శ్రీవిష్ణు జంటగా నటించిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుపుకొంటోంది. అవినీతి నేపథ్యంలో సాగే కథతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సిద్ధమైన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సినిమా టీజర్‌ను నాని విడుదల చేశారు.

‘‘రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి. నేను మాములు మనిషిని’’ అంటూ శ్రీవిష్ణు చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ఈ టీజర్‌ ప్రారంభమైంది. ఇందులో శ్రీవిష్ణు విలేకరిగా కనిపించనున్నారు. ‘‘సీఎం కుర్చీలో కూర్చొన్న ఎవరైనా ఒక్క సంతకంతో స్టేట్‌ ఫ్యూచర్‌నే మార్చేయవచ్చు. అంటే ఆ పవర్‌ చేతిదా? లేక కుర్చీదా?’’ అంటూ టీజర్‌ చివర్లో శ్రీవిష్ణు చెప్పే సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని