Nani: ఆది పెళ్లిలో నాని, సందీప్‌ స్టెప్పులు.. వీడియో వైరల్‌

నటుడు ఆది పినిశెట్టి వివాహం వేడుకగా జరుగుతోంది. తన ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ మెడలో ఆయన ఈరోజు సాయంత్రం మూడుముళ్లు వేయనున్నారు.....

Published : 18 May 2022 16:20 IST

హైదరాబాద్‌: నటుడు ఆది పినిశెట్టి వివాహం వేడుకగా జరుగుతోంది. తన ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ మెడలో ఆయన ఈరోజు సాయంత్రం మూడుముళ్లు వేయనున్నారు. చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతోన్న ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్‌, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆదికి ఆప్తమిత్రులైన నాని, సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు. హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్‌ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆది-నిక్కీలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ (Yagavarayinum Naa Kaakka) కోసం మొదటిసారి ఆది-నిక్కీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఇక, ‘ఒక విచిత్రం’, ‘గుండెల్లో గోదారి’, ‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’ చిత్రాలతో ఆది తెలుగువారికి సుపరిచితులయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని