Baahubali 3: రూ.150కోట్లతో తీసిన ‘బాహుబలి3’ని పక్కన పెట్టేశారా?
ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’(bahubali). రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. కాగా, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’(Baahubali: Before the Beginning) పేరుతో ఓ సిరీస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసినట్లు సమాచారం.
ఇప్పటివరకూ రూ.150కోట్లు ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరిపారు. అయితే, ఫైనల్ అవుట్‌పుట్‌పై సంతృప్తి చెందని నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసిందట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త తెగవైరల్ అవుతోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే, అంతకు ముందే మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కొంత భాగాన్ని చిత్రీకరించగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత వామికా గబ్బి కీలక పాత్రలో చాలా సన్నివేశాలను రీషూట్ చేశారు. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారా? లేక తాత్కాలికమేనా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ‘ది రైజ్ ఆఫ్ శివగామి’, ‘చతురంగ’, ‘క్వీన్ ఆఫ్ మాహిష్మతి’ రచనల ఆధారంగా ఆనంద్ నీలకంఠన్, దేవకట్టా ఈ సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ప్రవీణ్ సత్తారుతో కలిసి దేవకట్టా దీనికి దర్శకత్వం వహించారు. వామికా, రాహుల్ బోస్, అతుల్ కుల్కర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే