Bollywood: కేవలం నటన మాత్రమే కాదు.. అంతకు మించి..
ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిస్తేనే రెండో ఇన్నింగ్స్! ఇది క్రికెట్లో నిబంధన. కానీ, మన హీరోయిన్లకు
ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిస్తేనే రెండో ఇన్నింగ్స్! ఇది క్రికెట్లో నిబంధన. కానీ, మన హీరోయిన్లకు అంత ఓపిక లేదండోయ్! యాక్టింగ్ కెరీర్ ముగియకముందే వ్యాపారం అనే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. సిక్సర్లు బాదేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేలా! ఇంతకీ ఎవరు ఏ వ్యాపారాల్లో ఉన్నారు? అని తెలుసుకోవాలనుందా? ఇవిగో ఆ వివరాలు..
ఎల్లలు దాటిన ప్రియాంక
బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది ప్రియాంక చోప్రా. అలాగే వ్యాపారంలోనూ ఒక్క రంగానికే పరిమితం కాలేదు. ‘పర్పుల్ పెబెల్ పిక్చర్స్’ పేరుతో ఆమెకో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ‘అనోమలీ’ పేరుతో కేశసౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ నడిపిస్తోంది. కుర్ర జంటల్ని ఆకట్టుకోవడంలో ముందున్న ‘బంబుల్’ అనే డేటింగ్ యాప్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. ఇంతేకాదండోయ్.. ‘సోనా’ బ్రాండ్‌తో ఆకాశహర్మ్యాల నగరం న్యూయార్క్‌లో రెస్టారంట్లనే నడిపిస్తోంది.
సౌందర్యానికే కత్రినా ఓటు
షేర్మార్కెట్లో కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా ‘నైకా’ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లిస్టింగ్ రోజే ఈ ఆన్లైన్ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ బంపర్ లాభాలు రాబట్టింది. ఇందులో మన కత్రినాకైఫ్‌కి చెప్పుకోదగ్గ వాటా ఉందండోయ్! వాటాలు కాకుండా కేవలం లిస్టింగ్ రోజున కత్రినా రూ.22 కోట్ల లాభాలు మూటకట్టుకుందట. ఇదేకాదు.. ‘కే బ్యూటీ కాస్మొటిక్స్’ కంపెనీలోనూ క్యాట్ వ్యాపార భాగస్వామి.
అందరికన్నా ముందున్న దీపిక
కెరీర్ జోరు మీదున్నప్పుడే వ్యాపారంలోకి అడుగుపెట్టిన అమ్మడు దీపికా పదుకొణె. ‘కేఏ ఎంటర్ప్రైజెస్’ పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి తొమ్మిదేళ్ల కిందటే ఓ వ్యాపార సంస్థ ప్రారంభించింది. ‘ఎపిగామియా’ అనే ఎఫ్ఎంసీజీ సంస్థ, ‘ఫ్రంట్ రో’ అనే ఎడ్యు స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది. ‘బ్లూ స్మార్ట్’ అనే ఎలక్ట్రిక్ టాక్సీ స్టార్టప్‌లోనూ వాటాలున్నాయి. బెల్లాట్రిక్స్ అనే ఏరోస్పేస్ టెక్నాలజీ కంపెనీలోనూ అడుగుపెట్టిందని టాక్. ‘కేఏ ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ తనదే.
ఎదురులేని అనుష్క
నటనలోనే కాదు.. సినిమా నిర్మాణంలో దూసుకెళ్తున్న నటి అనుష్కశర్మ. ఇరవై ఏడు ఏళ్లకే ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్‌కి యజమానురాలైంది తను. ‘ఎన్‌హెచ్ 10’ కమర్షియల్ హిట్ అందుకుంది. ‘నుష్’ పేరుతో ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్ నిర్వహిస్తోంది. భర్త, క్రికెటర్ విరాట్ జిమ్ స్టూడియోల్లోనూ తన ‘షేర్’ ఉండనే ఉంది.
అలియా వైవిధ్యంగా..
లేత పరువాల సుందరి అలియా భట్ వ్యాపారంలోనూ ముందుంది. తనూ కత్రినాతోపాటు ‘నైకా’లో భారీ పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ‘ఎడ్-ఎ-మమా’ పేరుతో చిన్నపిల్లల కోసం డిజైనర్ దుస్తుల వ్యాపారం చేస్తోంది. ‘ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్’ సినిమా, టీవీ నిర్మాణ సంస్థలో భాగస్వామి అలియా.
మన సమంత.. తగ్గట్లేదు
ఈ స్టార్ల జాబితాలో మన సమంతకీ చోటు దక్కింది. ఏడాది కిందటే ‘సాకీ’ పేరుతో సొంత దుస్తుల బ్రాండ్ మొదలుపెట్టింది. కేరళలో పేరున్న ఓ జ్యువెల్లరీ కంపెనీలోనూ తనకి వాటాలున్నాయన్నది కొన్ని పత్రికల సారాంశం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి స్థానిక చేనేత కళాకారుల కోసం ప్రచారం చేస్తోంది.
క్రికెట్ బాటలో ప్రీతి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ జట్టుకి ప్రీతి సహ యజమానురాలన్నది జగమెరిగిన విషయం. కానీ జనాలకు తెలియని సంగతి ఏంటంటే.. దక్షిణాఫ్రికాలోని జట్టు ‘స్టెలెన్‌బాష్ కింగ్స్’కి సైతం తను ఓనరే. ముంబయిలో సొంతంగా రెండు రెస్టారంట్లు నిర్వహిస్తోంది. ‘పీఎన్‌జడ్‌ఎన్’ పేరుతో సొంత నిర్మాణసంస్థ కూడా ఉంది.
యోగా వ్యాపారవేత్త మలైకా
కుర్ర హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న బాలీవుడ్ సుందరి మలైకా యోగాలో దిట్ట. దాన్నే తన వ్యాపారానికి అనువుగా మలుచుకుంది. ‘సర్వ’, ‘దివ’ పేరుతో ముంబయిలో రెండు యోగా స్టూడియోలు నిర్వహిస్తోంది. ‘లేబుల్ లైఫ్’ పేరుతో తనకో ఫ్యాషన్ బ్రాండ్ ఉంది. ఇది కేవలం అమ్మాయిలకే స్పెషల్.
ఆల్‌రౌండర్ శిల్పాశెట్టి
నటనలో కన్నా వ్యాపారంలోనే శిల్పాశెట్టికి ఆల్‌రౌండర్ అనే పేరుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు బిజినెస్‌లోకి దిగింది. యోగాసనాలతో సీడీలు రూపొందించడంతో మొదలైంది వ్యాపారం. తర్వాత యోగా స్టూడియోలు తెరిచింది. రెస్టారంట్ల వ్యాపారంలో దూసుకెళ్తోంది. లగ్జరీ స్పాలు నిర్వహిస్తోంది. ‘ఎస్ఎస్’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ జట్టులో తను భాగస్వామి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్