Radheshyam: ‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌.. గుప్పుమన్న వార్తలు

చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) లవర్‌బాయ్‌ పాత్రలో నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ (Radheshyam). ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు.....

Published : 26 Jan 2022 13:30 IST

హైదరాబాద్‌: చాలా సంవత్సరాల తర్వాత పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) లవర్‌బాయ్‌ పాత్రలో నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ (Radheshyam). ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. వింటేజ్‌ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలుమర్లు వార్తలు వచ్చినప్పటికీ తమ ప్రాధాన్య మాత్రం థియేటర్లే అని చిత్రబృందం ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ‘రాధేశ్యామ్‌’ రిలీజ్‌పై వార్తలు గుప్పుమన్నాయి.

‘రాధేశ్యామ్‌’ని ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుందని.. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌, జీ5 నుంచి ‘రాధేశ్యామ్‌’కు భారీ ఆఫర్‌ వచ్చిందని.. టీమ్‌ కూడా అందుకు సుముఖంగా ఉందని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని నెట్టింట్లో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. తాజాగా జరుగుతోన్న ప్రచారంతో మరోసారి ‘రాధేశ్యామ్‌’ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటి పూజాహెగ్డే నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని