Priyanka Chopra: తల్లిదండ్రులైనప్రియాంక- నిక్‌ దంపతులు..!

గ్లోబుల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్‌ దంపతులు తమ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పి సర్‌ప్రైజ్‌ చేశారు. సరోగసీ పద్ధతిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంక-నిక్‌...

Updated : 22 Jan 2022 10:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్‌ దంపతులు తమ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పి సర్‌ప్రైజ్‌ చేశారు. సరోగసీ పద్ధతిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంక-నిక్‌ తాజాగా సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘సరోగసీ విధానంలో మేం పండంటి బిడ్డకు జన్మనిచ్చాం. మాకెంతో సంతోషాన్నిచ్చిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. కాబట్టి దయచేసి మా వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నాం’’ అని ఈ జంట రాసుకొచ్చింది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ‘కంగ్రాట్స్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్‌’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్‌ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన తర్వాత ఆమె లాస్‌ఏంజెల్స్‌లో సెటిలైంది. ప్రస్తుతం వరుస హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని