సొంత హోటల్‌లో అడుగుపెట్టిన ప్రియాంక

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారంట్‌ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆదివారం అక్కడికి అడుగుపెట్టారామె. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Updated : 27 Jun 2021 19:06 IST

న్యూయార్క్‌: ప్రముఖ నటి ప్రియాంక చోప్రా న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారంట్‌ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆదివారం అక్కడికి అడుగుపెట్టారామె. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ట్రెండీ దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. పానీ పూరిని ఆస్వాదించిన, సిబ్బందితో దిగిన కొన్ని ఫొటోల్ని షేర్‌ చేశారు. ‘చివరిగా ఇలా సోనా దగ్గర ఉంటాననే విషయాన్ని నమ్మలేకపోతున్నా. మూడేళ్ల ప్రణాళిక అనంతరం ఇది పూర్తయింది. కిచెన్‌లోకి వెళ్లాలని, మా బృందాన్ని కలవాలని నా మనసు తహతహలాడేది. మిమీస్‌ పేరిట రూపొందించిన ప్రైవేటు డైనింగ్‌ రూం, ఇంటీరియర్‌, నోరూరించే ఆహారం, డ్రింక్స్‌.. అన్నీ ఎంతో బాగున్నాయి. ఇదొక మధురమైన అనుభవం’ అని తెలిపారు ప్రియాంక. 2019 సెప్టెంబరులో దీని నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని