Vikram: పద.. చూసుకుందాం!

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలు  పోషించారు. సూర్య అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై విడుదల

Updated : 21 May 2022 08:15 IST

మల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలు  పోషించారు. సూర్య అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ‘‘అడవి అన్నాక సింహం, పులి, చిరుత.. అన్నీ  వేటకెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆలోపు సూర్యాస్తమయమైతే.. సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ, ఈ అడవిలో వెలుగు ఎప్పుడు, ఎక్కడా అని నిర్ణయించేది ప్రకృతి కాదు. నేను’’ అనే వాయిస్‌ ఓవర్‌తో విక్రమ్‌లోని పాత్రల్ని పరిచయం చేసిన తీరు ఆసక్తిరేకెత్తించేలా ఉంది. కమల్‌, విజయ్‌, ఫహాద్‌ల పాత్రలు మూడు వేటికవే శక్తి మంతంగా కనిపించాయి. ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ హంగామానే కనిపించింది. ‘‘సర్‌.. మనల్ని  బయటకు రానీయకుండా సంతానం మనుషులు చుట్టుముట్టేస్తే ఏం చేయాలి?’’ అని ఓ వ్యక్తి అడగ్గా.. ‘‘ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాటేంటో తెలుసా? పద చూసుకుందాం’’ అని కమల్‌ బదులివ్వడం ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాకి అనిరుధ్‌ స్వరాలందించారు. గిరీష్‌ గంగాధర్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు