Ram Pothineni: ‘వారియర్‌’గా రాబోతున్నరామ్‌!

రామ్‌ పోతినేని నటించిన గత రెండు చిత్రాలు.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రెడ్‌’ బ్లాక్‌బ్లాస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. అదే జోరుతో కోలీవుడ్‌ సెన్సెషనల్‌ దర్శకుడు లింగుస్వామితో ఓ చిత్రం చేస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి తాజాగా ‘ది వారియర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌తోపాటు రామ్‌ పోతినేని

Updated : 17 Jan 2022 14:06 IST

టైటిల్‌ రివీల్‌ చేసిన చిత్రబృందం

హైదరాబాద్‌: కథానాయకుడు రామ్‌ పోతినేని నటించిన గత రెండు చిత్రాలు.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘రెడ్‌’ మాస్‌ సినిమాలుగా మంచి పేరు తీసుకొచ్చాయి. అదే జోరుతో కోలీవుడ్‌ సంచలన దర్శకుడు లింగుస్వామితో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి తాజాగా ‘ది వారియర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌తోపాటు రామ్‌ పోతినేని ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌.. పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌ సరసన కృతి శెట్టి, అక్షర గౌడ నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు