Samantha: సమంత కొత్త సినిమా... రానా మాటసాయం

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత.. ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’  అనే చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న సంగతి సంగతి తెలిసిందే! ‘‘ ఈ సినిమా ద్వారా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా,  షూటింగ్‌ ప్రారంభమవ్వడానికి ఎదురుచూస్తున్నా

Published : 01 Dec 2021 01:47 IST

 ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లోని పాత్రకు సామ్‌ న్యాయం చేస్తుందని నిర్మాతలకు సూచనలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత.. ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’  అనే చిత్రంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న సంగతి సంగతి తెలిసిందే! ‘‘ ఈ సినిమా ద్వారా కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా,  షూటింగ్‌ ప్రారంభమవ్వడానికి ఎదురుచూస్తున్నా’’  అంటూ ఇటీవలే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. మరి ఈ క్రేజీ ఆఫర్‌ సామ్‌కి ఎలా వరించిందనే విషయం పై ఓ గుసగుస నడుస్తోంది. కీలక పాత్రకు ఎవరైతే బాగుంటారని నిర్మాతలు ఆలోచిస్తుండగా.. సామ్‌కు ఆ కథ వినిపించమని నిర్మాతలకు రానా సలహాఇచ్చారట. ఇక సమంతకి కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. భారత రచయిత తిమేరి ఎన్‌ మురారీ రచించిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ నవల ఆధారంగా చేసుకుని తెరకెక్కనుంది.  గురు ఫిల్మ్స్‌ పతాకంపై సునీత తాటి నిర్మిస్తుండగా.. ఫిలిప్‌ జాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సూపర్‌డీలక్స్‌’, ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ల్లో సమంత బోల్డ్‌ రోల్స్‌లో కనిపించిన సామ్‌ ఇందులోనూ అదే తరహా పాత్ర పోషించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని