సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా?
కథానాయిక సాయిపల్లవికి ఇంటి నుంచే పోరు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆమెకు బయట కథానాయికల నుంచే కాకుండా ఇంటిలో ఉన్న ఓ వ్యక్తి నుంచే పోటీ రానున్నట్లు సమాచారం.....
చెన్నై: కథానాయిక సాయిపల్లవికి ఇంటి నుంచే పోటీ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు పోటీ ఎవరంటే.. సాయిపల్లవి సోదరి పూజా కన్నన్. డ్యాన్స్, చలాకీతనంలో అక్కతో పోటీపడే పూజా తరచూ తన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. పూజా అందం, అభినయానికి ఫిదా అయిన ప్రముఖ స్టంట్ మాస్టర్ శివ.. తాను దర్శకత్వం వహించనున్న మొదటి సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. శివ చెప్పిన కథ నచ్చడంతో కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు పూజా కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే సాయిపల్లవికి ఇంటి నుంచి పోటీ మొదలైందని కోలీవుడ్‌లో అందరూ చెప్పుకుంటున్నారు.
ఇక, సాయిపల్లవి విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ‘విరాటపర్వం’, ‘లవ్‌స్టోరీ’ పనుల్లో బిజీగా ఉన్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’కి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు విప్లవ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ‘విరాటపర్వం’ ఏప్రిల్ 30న విడుదల కానుంది. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకుడు. ఇవే కాకుండా ‘వేదాళం’ రీమేక్‌తోపాటు ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లోనూ సాయిపల్లవి కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్