samantha: చై-సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌పై సమంత స్పందన ఇదే!

లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ చూసిన అభిమానులతో పాటు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా ‘సూపర్‌’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై నటి, నాగచైతన్య సతీమణి సమంత కూడా స్పందించారు.

Updated : 07 Dec 2022 16:33 IST

హైదరాబాద్‌: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. యువతను ఆకట్టుకునేలా శేఖర్‌ కమ్ముల మరోసారి మేజిక్‌ చేయడానికి సిద్ధమయ్యారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ చూసిన అభిమానులతో పాటు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా ‘సూపర్‌’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై నటి, నాగచైతన్య సతీమణి సమంత కూడా స్పందించారు.

నాగచైతన్య చేసిన ట్రైలర్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ, ‘విన్నర్‌. సాయిపల్లవి టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’ అని సామ్‌ ట్వీట్‌ చేశారు. ‘థ్యాంక్‌ యూ సో మచ్‌’ అంటూ సాయిపల్లవి కూడా సమాధానం ఇచ్చారు. ఏషియన్‌ సినిమాస్‌ పతాకంపై నారంగ్‌ దాస్‌ కె నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌ రావులు ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్‌ సీహెచ్‌ స్వరాలు సమకూర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని