
Sharwanand: ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 25న ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
‘‘కుటుంబ వినోదంతో కూడిన చిత్రమిది. శర్వానంద్ పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ అలరిస్తాడు. రష్మిక మందన్న పాత్ర ఓ మంచి అనుభూతిని పంచుతుంది. ఇతర మహిళల పాత్రలు అలరిస్తాయి’ అని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్సీఎమ్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాశ్, ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్.