Shekhar Kammula: పెద్ద మనసు చాటుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల 

దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ రైతుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ఈ నెల 21న కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది.

Published : 26 Oct 2021 15:51 IST

 పూరిల్లు దగ్ధమైన రైతుకు ఆర్థికసాయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ రైతుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ఈ నెల 21న కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు దగ్ధమైంది. ఈ క్రమంలో బీరువాలోని ఆరు లక్షల రూపాయలు మంటల్లో కాలిపోయాయి. విషయం తెలుసుకున్న శేఖర్ కమ్ముల.. ఆ రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయలు పంపించారు. రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆపద కాలంలో ఆదుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు శేఖర్‌ కమ్ముల. గతేడాది కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ అమిగోస్‌ నుంచి వెయ్యి మంది కార్మికులకు నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని