Published : 23/11/2021 20:31 IST

Shruthi Hassan: బిగ్‌బాస్-5 హోస్ట్‌గా శ్రుతిహాసన్‌?

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5 తమిళానికి హోస్ట్‌గా శ్రుతిహాసన్‌ చేస్తుందనే అనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ కార్యక్రమానికి ఇన్నిరోజులు హోస్ట్‌గా చేసిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ సోమవారం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న కమల్‌కు స్వల్ప కరోనా లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో ఐసోలేట్‌ అయి చికిత్స తీసుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారాయన. ప్రస్తుతం తమిళ్‌ బిగ్‌బాస్‌-5లో ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కమల్‌ స్థానంలో తాత్కాలికంగా..ఆయన  కుమార్తె శ్రుతిని తీసుకున్నారనే మాట తెగ వినిపిస్తోంది. కమల్‌.. తన స్టైల్‌తో కంటెస్టెంట్లతో విభిన్నంగా వ్యవహరిస్తారని..  అంతటి స్థాయిలో ఎవరు మెప్పించగలరు? కొన్ని రోజుల పాటు షోను ఆసక్తికరంగా ఎవరు నడిపించగలరు? ఇలా పలు కోణాల్లో ఆలోచించిన షో మేకర్స్‌ ముందుగా శ్రుతిహాసన్‌ని సంప్రదించారట. దీనిపై శ్రుతి త్వరలో ఓ క్లారిటీ ఇవ్వనుంది. తెలుగులో గతేడాది బిగ్‌బాస్-4లో షూటింగ్‌ కారణంగా నటుడు నాగార్జున పాల్గొనలేని సందర్భాల్లో నటి రమ్యకృష్ణ, సమంత ఆయన స్థానంలో ప్రేక్షకులను అలరించారు. మరి తమిళ్‌ బిగ్‌బాస్‌లో ఏమువుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరి!

 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని