Sirivennela: ‘ఇదే చివరి పాట కావొచ్చు’ అని ఆ రోజు గట్టిగా నవ్వేశారు!
ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి(Sirivennela SeetharamaSastry) మృతిని చిత్ర పరిశ్రమ ఇప్పటికీ మరువలేకపోతోంది.
హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి (Sirivennela SeetharamaSastry) మృతిని చిత్ర పరిశ్రమ ఇప్పటికీ మరువలేకపోతోంది. ‘పాటల రూపంలో ఆయన బతికే ఉన్నారు’ అన్న నిజంతో ముందుకు సాగుతోంది. కాగా, నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ రెండు పాటలు రాశారు. అందులో ఒక పాటకు ఆయన పేరే పెట్టి విడుదల చేస్తున్నట్లు కథానాయకుడు నాని (Nani) ప్రకటించారు. అసలు ఈ పాట రాసినప్పుడు సిరివెన్నెల (Sirivennela SeetharamaSastry) ఏమన్నారన్న విషయాన్ని దర్శకుడు రాహుల్ పంచుకున్నారు.
‘‘నవంబరు 3వ తేదీ రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela SeetharamaSastry) గారు ఫోన్ చేశారు. ‘ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నా ఇంకెవరితోనైనా రాయిద్దాం’ అన్నారు. ‘పర్వాలేదు సర్’ అని చెప్పా. మరుసటి రోజు ఉదయం ఆయనే కాల్ చేసి నన్ను నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. ‘పల్లవి అయిపోయింది చెబుతాను రాసుకో’ అన్నారు. సడెన్‌గా చెప్పేసరికి ఎక్కడ రాయాలో అర్థం కాలేదు. పక్కనే మహాభారతం పుస్తకం ఉంటే దాని మీద రాసేశాను. అద్భుతమైన ఆరు లైన్లు ఇచ్చారు. అందులో మొదటి లైన్లో ఆయన పేరు రాశారు. ‘ఎందుకు సర్ ఈ పాటకు మీ సంతకం ఇచ్చారు’ అని అడిగాను. ‘బహుశా ఇదే నా ఆఖరి పాట అవ్వొచ్చు’ అని గట్టిగా నవ్వారు’’ అని రాహుల్ చెప్పారు. ‘‘ఈ పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది సర్.. అందుకే మీ పేరే పెట్టుకున్నాం. మీరు వెళ్లిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం మాకు వచ్చినందుకు మా టీమ్ తరపున ధన్యవాదాలు’’ అని రాహుల్ సాంకృత్యన్ భావోద్వేగంతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్‌తో విజయ్.. టైటిల్స్‌తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్‌పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు. -
‘డియర్’.. ‘గుడ్‌నైట్’ ఫిమేల్ వెర్షన్ కాదు: ఐశ్వర్యరాజేశ్
ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. -
ప్రభాస్‌తో హను రాఘవపూడి సినిమా లాక్.. ఏ జానరంటే!
తన తర్వాత సినిమా ప్రభాస్‌తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు. -
ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). -
పుష్పగాడి రూల్ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది..!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకుడు. -
ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి. -
ఇది కదా.. ‘పుష్ప’ రేంజ్.. రూల్ చేయడానికి వచ్చేస్తున్నాడు!
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసే టైమ్‌ను తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను పంచుకుంది. -
‘భారతీయుడు 2’ వచ్చేది అప్పుడే.. అధికారికంగా ప్రకటించిన టీమ్
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు2’ విడుదలపై చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
బాక్సాఫీస్ వద్ద రూ.కోట్లు కొల్లగొడుతోన్న ‘ఆడు జీవితం’.. వసూళ్లు ఎంతంటే..?
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
హీరో అంటే హీరో పనే చేయాలి.. సినిమాను సినిమాటిక్‌గానే తీయాలి: దిల్ రాజు
Family Star: ఫ్యామిలీస్టార్ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోందని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. -
‘రామాయణ’ కోసం ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్స్!
బాలీవుడ్లో తెరకెక్కనున్న ‘రామాయణ’పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
హెడ్‌ఫోన్స్ రెడీ చేసుకోండి.. ‘పుష్ప2’ మోత మోగిపోవడమే ఇక..!
Pushpa2 update: అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’కు సంబంధించి మ్యూజిక్ సెషన్స్ జరుగుతున్నాయి.