Singer chinmayi: పెళ్లైన హీరోయిన్లు ఎందుకు నటించకూడదు?
‘‘పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో నటించడం’’ అనే అంశంపై గాయని చిన్మయి శ్రీపాద తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: గతంలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. మీటూ ఉద్యమం వేదికగా నిర్భయంగా తన గళం విప్పారు. ఈ ఉద్యమమే దేశంలో లైంగిక దాడులకు గురవుతున్న మహిళలు... తమకు జరుగుతున్న అన్యాయాల గురించి బయట ప్రపంచానికి ధైర్యంగా చెప్పుకొనేలా చేసింది. ఇక తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదిక చిన్మయి మరో పోస్ట్ పెట్టారు. ‘‘పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో నటించడం’’ అనే అంశంపై తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు.. నా బంధువుల్లో ఓ వ్యక్తి ‘వివాహం అనంతరం హీరోయిన్లు ఎందుకు సినిమాలు చేయకూడదో వివరించాడు. ఆయనో దర్శకుడు. నా కుటుంబంలోని వ్యక్తులకే నచ్చజెప్పడం నిస్సహాయంగా భావిస్తున్నా. లింగ సమానత్వం గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివాను. నేనే వాటి గురించి ఎక్కువ చర్చిస్తా కూడా. అలాంటి ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఎందుకంటే.. ఆయన చేసే వ్యాఖ్యలు విన్నప్పుడు నాలో వచ్చే మొదటి రియాక్షన్ కోపమే. ఆ కోపంలో ఏదేదో మాట్లాడేస్తామోనని భయం. మళ్లీ దాని గురించి తర్వాత పశ్చాత్తాపడటం జరుగుతుంది. అంతే కాదు.. వాళ్లంతా చాలా తేలికగ్గా నాపై ‘‘ఫెమినిస్ట్ బ్యాచ్’’ అనే కామెంట్లు చేస్తారు.
అది విషపూరిత పితృస్వామ్య మనస్తత్వం...
‘‘పెళ్లైన తరువాత ఒక మహిళ హీరోయిన్గా నటించకూడదనేది ఒక విషపూరిత పితృస్వామ్య మనస్తత్వం. ఇదంతా ఓ అమ్మాయి.. తాను కన్న కలలు, భవిష్యత్తు, డబ్బు, నిర్ణయాలే కాదు ఆమె శరీరం, గర్భాశయం కూడా పురుషుడికే సొంతమనే విషపూరితమైన మనస్తత్వంలో నుంచి వచ్చింది. పెళ్లైయ్యాక ఒక మగాడు నటించొచ్చు కానీ ఓ ఆడది నటించకూడదనే ఆలోచనలకు సరైన కారణమేమిటో ఆలోచించండి’’
ఆ ముగ్గురు హీరోయిన్లు సరిహద్దును చెరిపేశారు
సినీ ప్రపంచంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, టాలీవుడ్ హీరోయిన్ సమంత.. అలాగే ఇజ్రాయెల్ నటి, ముగ్గురు పిల్లలకు అమ్మ అయిన.. గాల్ గాల్ గాడోట్‌తో పాటు మరెందరో.. మైలురాయి తరువాత మైలురాయిని సాధించి భారీ అడ్డుకట్టలను తొలగించారు. నిజానికి 1950, 1960ల్లోనే ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకు నిదర్శనం అలనాటి మహానటి సావిత్రి. పెళ్లైయాక కూడా విజయవంతమైన నటిగా కొనసాగారు. ‘‘ఒక మగాడి కెరీర్లో పెళ్లి అనేది ఎలాంటి ప్రభావం చూపకపోతే మహిళకు కూడా అదే వర్తించాలి.’’ కచ్చితంగా.. నేను గర్వంగా చెప్పుకుంటా నేను ‘‘ఫెమినిస్ట్ బ్యాచ్’’నే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్‌లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్‌లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్‌లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్‌మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్‌లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్‌లో పోరాడి ఓడిన లఖ్‌నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక