ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో సునీత సందడి

కరోనావేళ ప్రముఖ గాయని సునీత తన గాత్రంతో కాస్త ఉపశమనం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె చెప్పినట్లుగానే రాత్రి 8గంటలకు ఇన్‌స్టాగ్రామ్‌లోవకి వచ్చారు. అభిమానులు పెట్టిన కామెంట్లు చదువుతూ.. వాటికి బదులిచ్చారు. కాసేపు ముచ్చటించారు. అంతేకాదు.. వాళ్లు కోరిన పాటలు పాడి అలరించారు.

Published : 08 May 2021 22:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనావేళ ప్రముఖ గాయని సునీత తన గాత్రంతో కాస్త ఉపశమనం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె చెప్పినట్లుగానే రాత్రి 8గంటలకు ఇన్‌స్టాగ్రామ్‌లోవకి వచ్చారు. అభిమానులు పెట్టిన కామెంట్లు చదువుతూ.. వాటికి బదులిచ్చారు. కాసేపు ముచ్చటించారు. అంతేకాదు.. వాళ్లు కోరిన పాటలు పాడి అలరించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పలు పాటలు ఆలపించారు. అందులో 90ల నాటి పాటలు మొదలు.. తాజాగా వచ్చిన ‘నీలినీలి ఆకాశం’ వరకూ ఉన్నాయి. ఇక నుంచి ప్రతి రోజు రాత్రి 8గంటలకు 30 నిమిషాల పాటు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ద్వారా నెటిజన్లు అడిగిన పాటలు పాడి వినిపిస్తానని ఆమె ఇప్పటికే చెప్పారు. కరోనా వేళ అందరూ కాస్త ఉపశమనం పొందేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని