Sonu Sood: నువ్వు లేని జీవితం శూన్యం

నటుడు, కరోనా కాలంలో రియల్‌ హీరోగా మారిన సోనూసూద్.. బుధవారం తన తల్లి సరోజ్​సూద్​ జయంతి సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి మరణంతో శూన్యం ఆవరించిందని....

Updated : 21 Jul 2021 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, కరోనా కాలంలో రియల్‌ హీరోగా మారిన సోనూసూద్.. బుధవారం తన తల్లి సరోజ్​సూద్​ జయంతి సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి మరణంతో శూన్యం ఆవరించిందని, ఆమె నేర్పిన జీవిత పాఠాలు తనకెంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. తన తల్లి యుక్త వయసులో ఉన్నప్పటి ఫొటోతోపాటు ఆమె పెళ్లి నాటి ఫొటోలను ఇన్​స్టాగ్రామ్‌లో పంచుకున్న సోనూ.. 'నిన్ను కౌగిలించుకొని నీకు శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రతిసారీ అనుకుంటా. నువ్వు బోధించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. నీ మరణంతో ఆవరించిన శూన్యం మళ్లీ నిన్ను కలిసేవరకు అలానే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉంటూ, నాకు సూచనలిస్తావని అనుకుంటున్నా. లవ్ యూ అమ్మా..' అంటూ భావోద్వేగంతో నిండిన పోస్టు పెట్టారు.

సోనూసూద్ సొంత గ్రామమైన పంజాబ్ రాష్ట్రం​ మోగాలోని ఓ రోడ్​కు ఆయన తల్లి పేరు పెట్టారు. ఆమె యుక్త వయసులో ఇంటి నుంచి కళాశాలకు ఆ రోడ్​లోనే వెళ్లేవారని, ఇప్పుడు ఆమె పేరు ఆ రోడ్డుకు పెట్టడం ఆనందంగా ఉందని సోనూ గతంలో అన్నారు.

గతేడాది కరోనా లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతోమంది ప్రజలకు సాయం చేసి, వారి మనసుల్లో చోటు సంపాదించారు సోనూసూద్. ‘రియల్‌ హీరో’గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమందికి తోడుగా నిలిచారు. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులకు తనవంతు సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయన సేవలకు మెచ్చి పలువరు తమ సంతానానికి సోనూసూద్‌గా నామకరణం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని