Arjuna Phalguna: ఆహాలో ‘అర్జున ఫల్గుణ’.. ట్రైలర్‌ చూశారా?

కాన్సెప్ట్‌ బేస్డ్‌ కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు నటుడు శ్రీవిష్ణు.

Published : 20 Jan 2022 16:21 IST

హైదరాబాద్‌: కాన్సెప్ట్‌ బేస్డ్‌ కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు నటుడు శ్రీవిష్ణు. ‘రాజ రాజ చోర’ విజయం తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి ‘అర్జున ఫల్గుణ’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.  సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా నటి అమృతా అయ్యర్‌ నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని