Taapsee: అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడ్డా: తాప్సీ

అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని నటి తాప్సీ అన్నారు. ‘తప్పడ్‌’, ‘హసీనా దిల్‌రుబ’, ‘బడ్ల’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో తనకంటూ ఓ స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్నారు....

Published : 29 Nov 2021 12:34 IST

ముంబయి: అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని నటి తాప్సీ అన్నారు. ‘తప్పడ్‌’, ‘హసీనా దిల్‌రుబ’ వంటి విభిన్న కథా చిత్రాల్లో నటించి బీటౌన్‌లో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ తార. ప్రస్తుతం మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘‘నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. సినిమాల్లో చూపించే హీరోయిన్స్‌లా నా ముక్కు సన్నగా ఉండదు. పెదవులు అందంగా కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. టీవీలో కనిపించే నటీమణులకు సైతం నాలాంటి జుట్టు ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని. అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక.. నాకు జట్టు రాలడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. నిజం చెప్పాలంటే.. అందానికి పరిమితులుగా చెప్పుకొనే కొన్నింటికీ నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోయాను. జీవితాన్ని ప్రేమతో జీవించాలని.. మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని