Updated : 15/11/2021 06:59 IST

Akshya Kumar: ‘పృథ్వీరాజ్‌’ టీజర్‌తో...

బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ జోరు కొనసాగుతోంది. ఇటీవలే ‘సూర్యవంశీ’ హిట్‌ అందుకున్న అక్షయ్‌... మరో చిత్రంతో ప్రేక్షకులను  అలరించడానికి సిద్ధమైపోయారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ‘పృథ్వీరాజ్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21 విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ విడుదల కానుంది. మానుషి చిల్లార్‌, సంజయ్‌దత్‌, సోనూ సూద్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్‌ ద్వివేది తెరకెక్కిస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. ‘దీని కోసం ప్రేక్షకుల కంటే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గతేడాది కరోనా-లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల విడుదల చేయలేక పోయాం. జనవరి 21న అద్భుతమైన సినిమాని అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నాం.’ అంటోంది చిత్రబృందం.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని