Updated : 30/11/2021 15:59 IST

Brahmanandam: బ్రహ్మానందంలో మరో కోణం.. ఎస్వీఆర్‌ వాయిస్‌ దించేశారు!

హైదరాబాద్‌: కోట్లాది తెలుగు ప్రేక్షకులు ‘ఆలీతో సరదాగా’లో హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం(Brahmanandam) రావాలని ఎంతగానో ఎదురు చూశారు. వారి కోరిక ఫలించింది. నవంబరు 29వ తేదీన ప్రసారమైన షోకు ఆయన విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమ లోకాన్ని మర్చిపోయారు. కాగా, ఈ సరదా సందడి మరో వారం కూడా కొనసాగనుంది. అందుకు సంబంధించిన ప్రోమో వీడియోను తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా అలనాటి నటుడు ఎస్వీ రంగారావు వాయిస్‌ను బ్రహ్మానందం(Brahmanandam) అద్భుతంగా ఇమిటేట్‌ చేశారు. ఇప్పటివరకూ బ్రహ్మానందంలో చూడని సరికొత్త కోణాన్ని చూపించారు. ‘ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూసి నవ్వుతుంది? మరి మిమ్మల్ని నవ్వించేది ఎవరు’ అని అడగ్గా, ‘‘మా మనవడు. ఏదైనా అంటే ‘తాత నీకు తెలియదు ఊరుకో..’’ అంటాడు. గౌతమ్‌ తన ప్రేమ విషయాన్ని చెప్పగానే వారం పదిరోజుల్లో పెళ్లి చేశారట! అని అనగా ‘మా అబ్బాయి ఏమీ మర్డర్‌ చేయలేదు కదా. అందుకే అడగ్గానే చేసేశా’ అని సమాధానం ఇచ్చారు. ఇక బ్రహ్మానందం పాపులర్‌ పదమైన జఫ్పాకు అంటే అర్థం ఏంటి? అన్న ప్రశ్నకు ‘‘ఒకసారి ఒక వ్యక్తిని చూస్తూ, ‘ఏంట్రా చూస్తే పెద్ద జఫ్పాగాడిలా ఉన్నావ్‌’ అన్నాను అంతే అప్పటి నుంచి అది పాపులర్‌ అయింది’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న కమెడియన్స్‌లో బ్రహ్మానందంకు ఎవరంటే ఇష్టం? ఇటీవల సినిమాల్లో బ్రహ్మానందం(Brahmanandam) జోరు తగ్గడానికి కారణం? ఇలాంటి ప్రశ్నలకు ఆయన ఏం చెప్పారో వచ్చే సోమవారం చూడాలి.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్