Updated : 24/11/2021 08:01 IST

Poorna: విడుదలకి  సిద్ధం

పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. తేజ  త్రిపురాన కథానాయకుడు. కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. బి.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాత. డిసెంబర్‌ 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శులు ప్రసన్నకుమార్‌, మోహన్‌ వడ్లపట్ల, నిర్మాత ఆచంట గోపీనాథ్‌, ‘రావణలంక’ కథానాయకుడు క్రిష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమా విడుదల హక్కుల్ని సొంతం చేసుకున్న నిర్మాత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘‘కథాబలం ఉన్న చిత్రమిది. ప్రేక్షకులకు చక్కటి వినోదం పంచుతుంది. నాపై నమ్మకంతో ప్రదర్శన హకుల్ని ఇచ్చిన  నిర్మాతకి నా కృతజ్ఞతలు. దర్శకుడిగా బాలాజీకి, నటీనటులకి మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బి.తిరుపతిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రఘు, విజయ్‌.ఎల్‌.కోట, విక్రమ్‌ రమేష్‌ పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని