Nagarjuna Naga Chaitanya:  బంగార్రాజు మొదలుపెట్టేశాడు..!

అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేశారు. నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించనున్న ‘బంగార్రాజు’ శుక్రవారం వేడుకగా ప్రారంభమైంది....

Published : 20 Aug 2021 14:43 IST

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేశారు. నాగార్జున ఆయన తనయుడు నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించనున్న ‘బంగార్రాజు’ శుక్రవారం వేడుకగా ప్రారంభమైంది. కల్యాణ్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కృతిశెట్టి కథానాయిక. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘బంగార్రాజు’ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టి, దర్శకుడితోపాటు ఇతర చిత్రబృందం హాజరయ్యారు. 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సిద్ధం కానుంది.

థియేటర్లలోనే సీటిమార్‌

గోపీచంద్‌ కథానాయకుడిగా తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘సీటిమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల గురించి చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. థియేటర్లలోనే ఈ సినిమా విడుదల కానుందని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో ‘సీటిమార్‌’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్‌ కోచ్‌గా కనిపించనున్నారు. తమన్నా కథానాయిక. భూమిక కీలకపాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని