Updated : 22/11/2021 07:18 IST

Akhanda: ‘అఖండ’ వేగం

సినీప్రియులకు వినోదాలు పంచేందుకు ‘అఖండ’తో బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకొస్తున్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి హిట్ల తర్వాత.. ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. శ్రీకాంత్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రచార చిత్రంలో బాలయ్య, ప్రగ్యా ఓ నదీ ఒడ్డున కారులో కూర్చొని ఆకట్టుకునేలా కనిపించారు. ‘‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. ద్వితీయార్ధంలో అఘోరాగా ఆయన శక్తిమంతంగా కనిపిస్తారు. శ్రీకాంత్‌ విలనిజం, జగపతిబాబు పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని