Bheemla Nayak: విడుదలలో తేదీలో మార్పు లేదు.. సంక్రాంతి బరిలోనే ‘భీమ్లా నాయక్‌’

పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. ఈ సినిమాని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది.

Published : 16 Nov 2021 22:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. ఈ సినిమాని 2022 సంక్రాంతికి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించించిన విషయం తెలిసిందే. అదే సీజన్‌లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (జనవరి 7), ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ (జనవరి 14) వస్తుండటంతో ‘భీమ్లా..’ వాయిదా పడే అవకాశం ఉందని అటు సినీ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో చర్చ సాగింది. తాజాగా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్పందించింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ‘భీమ్లా..’ ఉంటాడని, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో రిపోర్ట్‌ చేస్తాడని స్పష్టం చేసింది. 

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పవన్‌ టైటిల్‌ పాత్రలో పోలీసు అధికారిగా, రానా డానియల్‌ శేఖర్‌గా కనిపించనున్నారు. పవన్‌ సరసన నిత్యమేనన్, రానా సరసన సంయుక్త మేనన్‌ నటిస్తున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని