Bigg Boss Telugu 5: మానస్‌ సేఫ్‌.. ప్రియ-లహరిల్లో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు?

బుల్లితెర ప్రేక్షకులకి ప్రతిరోజూ వినోదం పంచుతోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్ సీజన్‌ 5’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Updated : 26 Sep 2021 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులకి వినోదం పంచుతోన్న కార్యక్రమం ‘బిగ్‌బాస్ సీజన్‌ 5’. ఈ షోకి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఎలిమినేషన్‌ ప్రక్రియ ఉండటంతో ఈ రోజు ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మానస్‌, ప్రియ, లహరి.. వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరా? అనే ప్రశ్నకి సమాధానం తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఎలిమేనష్లతోపాటు ఆదివారం ప్రసారంకానున్న ఎపిసోడ్‌లో సరదా సంగతులూ ఉన్నాయి.

డ్యాన్స్‌, బ్లైండ్‌ ఫోల్డ్‌ (కళ్లకి గంతలు కట్టుకోవడం) థీమ్స్‌తో హౌస్‌మేట్స్‌ సందడి చేయనున్నారు. ‘అమ్మాయిలు, అబ్బాయిలు విడివిడిగా ఉండటం నాకు ఇష్టం లేదు’ అని నాగార్జున అనగానే ‘మాకూ ఇష్టం లేదు’ అంటుంది సిరి. వెంటనే ‘అది తెలుసు’ అని నాగార్జున సమాధానం ఇవ్వడంతో హౌస్‌లో నవ్వుల వర్షం కురిసింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘ఓ మైగాడ్‌ డాడీ’ పాటకి అందరూ కాలు కదిపి ఎంజాయ్‌ చేశారు. ఇందులో నటరాజ్‌ ప్రత్యేకంగా నిలవడంతో ‘అందరికీ నటరాజ్‌ బ్యాడ్‌ డాడీనా?’ అంటూ నాగార్జున తనదైన శైలిలో కామెడీ పండించారు. అన్నట్టు ‘లెహరాయీ’ పాటకి డ్యాన్స్‌ చేస్తూ నాగార్జున ఇచ్చిన ఎంట్రీ వావ్‌ అనిపించేలా ఉంది. ఇక తాజా ప్రోమో ప్రకారం ఎలిమినేషన్‌లో ఉన్న మానస్‌ సేఫ్ అయినట్లు తెలుస్తోంది. లహరి, ప్రియల్లో ఒకరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని