Dhee 13 promo: ఇలాంటి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు.. ‘ఢీ’లో రోజా సందడి!

‘ఢీ 13’ లేటేస్ట్‌ ప్రోమో. రోజా ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు..

Updated : 15 Aug 2022 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశేష ప్రేక్షకాదరణతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రియాలిటీ షోగా పేరొందింది ‘ఢీ’. ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ పేరుతో ప్రస్తుతం 13వ సీజన్‌ ప్రసారమవుతోంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో సెమీ ఫైనల్స్‌కి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎపిసోడ్‌కి ప్రముఖ నటి రోజా ముఖ్య అతిథిగా విచ్చేసి అలరించారు. కార్యక్రమ న్యాయనిర్ణీతలు పూర్ణ, ప్రియమణి, టీమ్‌ లీడర్లు రష్మి, దీపికాతో కలిసి డ్యాన్స్‌ చేశారు. కంటెస్టెంట్ల ప్రతిభను మెచ్చుకున్నారు. రోజా పుట్టినరోజు (నవంబరు 17)ను పుస్కరించుకుని ఓ కంటెస్టెంట్‌ ఆమె సినిమాల్లోని పాటలకు అభినయించింది. ఈ పెర్ఫామెన్స్‌ తనని బాగా ఆకట్టుకోవడంతో ‘నా బర్త్‌డేకు మీరు చాలామంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇలాంటిది ఎవ్వరూ ఇవ్వలేరు’ అని రోజా ప్రశంసించారు. అనంతరం న్యాయనిర్ణీతలు, టీమ్‌ లీడర్లు, కంటెస్టెంట్ల సమక్షంలో కేక్‌ని కట్‌ చేశారు. ఉర్రూతలూగించే కంటెస్టెంట్ల పెర్ఫామెన్స్‌ చూడాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని