Dhee 13: సుధీర్‌, ఆది- రష్మి, దీపికలా మారితే..!

‘ఢీ 13’ కొత్త ప్రోమో విడుదలైంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం ఇది.

Updated : 17 Aug 2022 10:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత సుధీర్‌.. రష్మిలా, నటుడు ఆది.. దీపికలా మారితే ఎలా ఉంటుంది? ‘ఇదే అవకాశం అన్నట్టు తమ మనసులో ఏముందో బయట పెట్టేస్తారు. వినోదం పంచుతారు’ అని అనుకుంటున్నారా! మీరనుకుంది నిజమే. ‘ఢీ 13’ కార్యక్రమం వేదికగా వారు అదే చేశారు. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమవుతున్న షో ఇది. సెప్టెంబరు 8న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. వినాయకచవితిని పురస్కరించుకుని వినాయకుడి పాటలకి కంటెస్టెంట్‌లు చేసిన డ్యాన్సులు, కింగ్స్‌ టీమ్‌లీడర్లు సుధీర్‌, ఆది, క్వీన్స్‌ టీమ్‌లీడర్లు రష్మి, దీపిక అల్లరితో ఆద్యంతం అలరిస్తోంది. సుధీర్‌ - రష్మి, ఆది- దీపిక వారు వీరుగా- వీరు వారుగా మారిపోయి సందడి చేశారు. ఒకరిపై మరొకరు పంచ్‌లు వేస్తూ కామెడీ పండించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ హంగామాని మీరూ చూసేయండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని