Kapil Dev’s 83: కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌.. ‘83’ ట్రైలర్‌ వచ్చేసింది!

టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘83’ ట్రైలర్‌ విడులైంది. రణ్‌వీర్‌సింగ్‌, దీపిక పదుకొణె ప్రధాన పాత్రలో నటించిన...

Updated : 30 Nov 2021 15:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్‌దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌సింగ్‌ పోషించారు. కపిల్‌దేవ్‌ భార్యగా రణ్‌వీర్‌ సరసన దీపికా పదుకొణె నటించారు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌లో అప్పటి ప్రపంచకప్‌ ఎలా సాగిందో చూపించే ప్రయత్నం చేశారు. మెగా టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆనందక్షణాలను క్లుప్తంగా చూపించారు.

ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 3డీ వెర్షన్‌లోనూ చిత్రం విడుదలవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత అద్భుతమైన కథ. ట్రైలర్‌ మీకోసం’ అంటూ రణ్‌వీర్‌ సింగ్‌ చిత్రం హిందీ ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేయగా.. తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జునే విడుదల చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు