Kamal Haasan: కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.

Published : 22 Nov 2021 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తానే సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ‘ఇటీవల యు.ఎస్‌. నుంచి తిరిగి వచ్చాక దగ్గు మొదలైంది. పరీక్షలు చేయించుకున్నా. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నేను ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్నాను. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి’ అని సూచించారు. ఈ పోస్ట్‌ చూసిన ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు కమల్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘విక్రమ్‌’ అనే సినిమాలో నటిస్తున్న కమల్‌ హాసన్‌ ‘బిగ్‌బాస్‌’ (తమిళ్‌) సీజన్‌ 5కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు