Bigg Boss 5: ముసుగు తీసిన హౌస్‌మేట్స్‌.. కాజల్‌ రీజన్‌కు రవి షాక్‌.. షణ్ముఖ్‌పై ప్రియాంక ఫైర్‌

గత కొన్ని వారాల నుంచి బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ (Bigg Boss). వారం రోజులపాటు ఇంటిసభ్యులు ఎంత సరదాగా ఉన్నా నామినేషన్‌ వచ్చిందంటే చాలు..

Published : 01 Nov 2021 17:14 IST

ఇంటిసభ్యుల మధ్య నామినేషన్‌ చిచ్చు..!

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ (Bigg Boss). వారం రోజులపాటు ఇంటిసభ్యులు ఎంత సరదాగా ఉన్నా నామినేషన్‌ వచ్చిందంటే చాలు.. ఆరోజు వాళ్ల మధ్య ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటాయి. నామినేషన్‌ ప్రక్రియతో ఈ వారం మరోసారి ఇంటిసభ్యుల మధ్య వార్‌కు రంగం సిద్ధమైంది. గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో హౌస్‌మేట్స్‌ కొంతమంది టీమ్‌లుగా విడిపోయి.. ప్రత్యర్థులపై కయ్యానికి కాలు దువ్వారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన నామినేషన్‌ ప్రక్రియ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడికి ఓ ప్లేట్‌ క్రీమ్‌ ఇచ్చి.. నామినేట్‌ చేయాలనుకున్న వారి ముఖానికి దాన్ని పూయాలని బిగ్‌బాస్‌ సూచించాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగే అర్హత కాజల్‌కు లేదని పేర్కొంటూ రవి ఆమెకు క్రీమ్‌ పూశాడు. అనంతరం సిరి.. అనీ మాస్టర్‌, సన్నీని నామినేట్‌ చేసింది. ఇంటిసభ్యుల మధ్య ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు చూస్తే ‘కళాశాలలో చైన్‌ బ్యాచ్‌ గొడవల్లా’ ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసిన శ్రీరామ్ (Sriram)‌.. మానస్‌ని(Manas) నామినేట్‌ చేశాడు. ఇక, రవి (Ravi) కూడా మానస్‌తో వాగ్వాదానికి దిగాడు. రవిని నామినేట్‌ చేసేందుకు కాజల్‌ చెప్పిన రీజన్‌ విని అతడు షాకయ్యాడు. ‘నీ గేమ్‌ నువ్వు ఆడు’ అని ప్రియాంకను షణ్ముఖ్‌ నామినేట్‌ చేయగా, ‘హౌస్‌ నుంచి నన్ను బయటకు పంపిస్తే నా గేమ్‌ ఎవరు ఆడతారు’ అంటూ ప్రియాంక మండిపడింది. మరి, ఈ వారం నామినేషన్‌లో ఎవరు ఉన్నారో తెలియాలంటే ఈరోజు జరగనున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే..!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని