Shakeela: నేను ఆ షాట్‌ చేయడం చూసి నాన్నకు హార్ట్‌ఎటాక్‌ వచ్చింది: షకీలా

కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి షకీలా. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ప్రస్తుతం క్యారెక్టర్...

Published : 27 Oct 2021 01:09 IST

కన్నీళ్లు పెట్టుకున్న నటి

హైదరాబాద్‌: కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి షకీలా. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆమె సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘క్యాష్‌’ గేమ్‌ షోలో సందడి చేశారు. జ్యోతి, సంపూర్ణేశ్‌ బాబు, అభినయశ్రీలతో కలిసి సరదాగా గేమ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా షకీలా తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఎవరూ లేరని తలచుకుంటే బాధతో కన్నీళ్లు వస్తున్నాయంటూ బాధపడ్డారు.

తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ.. ‘‘మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమయంలో నటిగా రాణించడం కోసం నేను ఎంతలా కష్టపడ్డానో మా నాన్నకు బాగా తెలుసు. నా కష్టాలను ఆయన దగ్గరుండి చూశారు. ఓ సినిమా షూట్‌కు నాన్న నాతోపాటు సెట్‌కి వచ్చారు. షాట్‌లో భాగంగా నేను భవనంపై నుంచి కిందకు దూకాలి. డూపుల్లేకపోవడంతో నేనే దూకాల్సి వచ్చింది. అప్పుడు నా కాలు కూడా విరిగింది. అది చూసి మా నాన్నకు గుండెపోటు వచ్చింది. ఇకపై సినిమాల కోసం అలాంటి యాక్షన్‌ తరహా సన్నివేశాలు చేయవద్దని నాన్న చెప్పారు’’ అంటూ షకీలా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు జ్యోతి, సంపూర్ణేశ్‌ బాబు, షకీలాలు వరుస పంచులతో సరదాగా నవ్వులు పూయించారు. వచ్చే శనివారం ప్రసారం కానున్న ‘క్యాష్‌’ ప్రోగ్రామ్‌ ప్రోమో చూసేయండి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని